IIT Hyderabad : హైదరాబాద్ ఐఐటీలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలు

బీటెక్‌ లేదా బీఈ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌లో పీజీ చేసిన వారూ కూడా అర్హులే. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.msit.ac.in పరిశీలించగలరు.

IIT Hyderabad : హైదరాబాద్ ఐఐటీలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలు

Plank Wood Wall For Text And Background

IIT Hyderabad : హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) లో మాస్టర్‌ డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, యాప్‌ డెవలెప్‌మెంట్‌ స్పెషలైజేషన్లతో కోర్సు అందిస్తున్నారు. ఈ కోర్సు కాలవ్యవధి 16 నెలలు ఉంటుంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో కోర్సు కొనసాగుతుంది. ఆన్‌లైన్‌లో చదివే వారు ఫీజుగా రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో క్యాంపస్‌కు వచ్చి చదివేవారు రూ.3 లక్షల ఫీజుతోపాటు హాస్టల్‌, మెస్‌ ఛార్జీలు కట్టాలి.

వినూత్నంగా కొత్త తరహా విద్యావిధానాలతో ఈ కోర్సు అందించనున్నారు. దరఖాస్తు చేసిన విద్యార్థులకు రెండు వారాలపాటు కంప్యుటేషనల్‌ థింకింగ్‌ క్లాసులు జరుగుతాయి. అనంతరం ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ప్రవేశం కల్పిస్తారు. మొత్తం ప్రోగ్రాం టాపిక్స్‌ వారీగా ఉంటుంది. ఒక టాపిక్‌లో ‘ఏ’ గ్రేడ్‌ సాధిస్తేనే మరొకటి చదివేందుకు విద్యార్థి అప్‌గ్రేడ్‌ అవుతాడు. మొత్తం మూడు సెమిస్టర్లు ఉంటాయి.

ప్రతి విద్యార్థికీ ఒక మెంటర్‌ ఉండటంతోపాటుగా చిన్న చిన్న గ్రూపులు విభజించి క్లాసులు నిర్వహిస్తారు. విద్యార్థి తాను ఎప్పుడు సిద్ధమయ్యాడని భావిస్తే అప్పుడే పరీక్ష రాసేందుకు వెసులుబాటు ఉంటుంది. అదనంగా మరో సెమిస్టర్‌ ప్రాక్టికల్‌ వర్క్‌ ఉంటుంది. అమెజాన్‌, మెడ్‌ప్లస్‌, హెచ్‌ఎస్‌బీసీ, పేటీఎం, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, టీసీఎస్‌ వంటి ప్రముఖ కంపెనీలు ప్రాంగణ ఎంపికల ద్వారా ఈ విద్యార్థులకు ఉద్యోగం కల్పిస్తారు. తరగతులు ఆగస్టు, 2022 నుండి ప్రారంభం అవుతాయి. బీటెక్‌ లేదా బీఈ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌లో పీజీ చేసిన వారూ కూడా అర్హులే. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.msit.ac.in పరిశీలించగలరు.