Microsoft Training : మహిళా విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ సాంకేతిక శిక్షణ

శిక్షణలో మంచి నిపుణత సాధించిన 1,000 మందికి ఉద్యోగావకాశాలు, ఇంటర్న్‌షిప్స్, చిన్న వ్యాపారల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.

Microsoft  Training : మహిళా విద్యార్ధులకు మైక్రోసాఫ్ట్ సాంకేతిక శిక్షణ

Microsoft

Microsoft Training : మహిళలు పనితీరులో ఓర్పు నేర్పుతోపాటు, మంచి ప్రావీణ్యం కలిగి ఉండటంతో అనేక టెక్ కంపెనీలు తమ సంస్ధల్లో ఉద్యోగులుగా మహిళలకే అవకాశాలు కల్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో మహిళా విద్యార్ధుల్లో సాంకేతిక శిక్షణ ఇవ్వటం ద్వారా వారిలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రెండు దిగ్గజ సంస్ధలు చేతులు కలిపాయి.

ఎస్ ఏపి ఇండియా, మైక్రోసాఫ్ట్ లు ఉమ్మడిగా టెక్ సాక్షం పేరుతో మహిళా విద్యార్ధినులు 62వేల మందికి సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ తదితర అంశాల్లో ఈ శిక్షణ ఉండనుంది.

శిక్షణలో మంచి నిపుణత సాధించిన 1,000 మందికి ఉద్యోగావకాశాలు, ఇంటర్న్‌షిప్స్, చిన్న వ్యాపారల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. రాష్ట్రాల విద్యాశాఖలు, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ సాయంతో 1,500 మంది టీచర్లకు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వెబ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.