Nata : మూడు విడతల్లో నాటా ప్రవేశ పరీక్ష

మూడు సార్లు పరీక్ష రాస్తే అందులో ఎక్కువ స్కోరు ఉన్న రెండు పరీక్షల సగటును లెక్కిస్తారు. రిజిస్ట్రేషన్ పక్రియ ఈ నెల 8వ తేది నుండి ప్రారంభమైంది.

Nata : మూడు విడతల్లో నాటా ప్రవేశ పరీక్ష

Nata

Nata : 2022-23విద్యా సంవత్సరానికి అయిదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో ప్రవేశానికి నేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా)ను నిర్వహిస్తారు. అయితే ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఈసారి మూడువిడతల్లో నిర్వహించనున్నారు. పరీక్షను జూన్
12, జులై 3, 24 తేదీల్లో నిర్వహిస్తారు. అభ్యర్ధులు మూడు సార్లు పరీక్షకు హాజరు కావచ్చు. రెండు పరీక్షలకే హాజరైతే వాటిలో ఎక్కువ స్కోరు వచ్చిన పరీక్షను పరిగణలోకి తీసుకుంటారు.

మూడు సార్లు పరీక్ష రాస్తే అందులో ఎక్కువ స్కోరు ఉన్న రెండు పరీక్షల సగటును లెక్కిస్తారు. రిజిస్ట్రేషన్ పక్రియ ఈ నెల 8వ తేది నుండి ప్రారంభమైంది. ఏపిలో విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూల్లో ఆన్ లైన్
పరీక్షా కేంద్రాలుంటాయి. పూర్తి వివరాలకు https://www.nata.in/ పరిశీలించగలరు.