MNLU Mumbai Recruitment : నేషనల్ లా యూనివర్సిటీ నాగ్ పూర్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ నెట్‌, స్లెట్‌లో వ్యాలిడ్‌ స్కోర్ ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్‌ అనుభవం ఉండాలి.

MNLU Mumbai Recruitment : నేషనల్ లా యూనివర్సిటీ నాగ్ పూర్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ad

MNLU Mumbai Recruitment : మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని నేషనల్ లా యూనివర్సిటీలో రెగ్యులర్, ఒప్పంద ప్రాతిపదికన పలు ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం11 పోస్టులు భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ లా, రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ నెట్‌, స్లెట్‌లో వ్యాలిడ్‌ స్కోర్ ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్‌ అనుభవం ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.1,31,400లు, రిసెర్చ్ అసోసియేట్‌ పోస్టులకు రూ.50,000లు జీతంగా చెల్లిస్తారు.

అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు అక్టోబర్‌ 28, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్, మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ, నాగ్‌పూర్, వరంగల్, PO: డోంగర్‌గావ్ (బుటిబోరి), నాగ్‌పూర్ – 441108. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nlunagpur.ac.in/ పరిశీలించగలరు.