RRC NWR Apprentice Recruitment : నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని అప్రెంటీస్ ఖాళీల భర్తీ

10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ మెరిట్ జాబితా రూపొందించబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు ఉచితం. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ.100. దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.

RRC NWR Apprentice Recruitment : నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని అప్రెంటీస్ ఖాళీల భర్తీ

RRC NWR Apprentice Recruitment :

RRC NWR Apprentice Recruitment : నార్త్ వెస్ట్రన్ రైల్వే తమ పరిధిలోని అప్రెంటీస్ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఎలక్ట్రికల్, కార్పెంటర్, ఫిట్టర్, మెకానికల్, పెయింటర్ వంటి వివిధ ట్రేడ్‌లలో అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2026 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే టెన్త్ తో పాటు, ఐటీఐ విద్యార్హతను కలిగి ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసినట్లు సర్టిఫికెట్ కూడా ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15-24 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది.

10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ మెరిట్ జాబితా రూపొందించబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు దరఖాస్తు ఉచితం. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ.100. దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించేందుకు ఫిబ్రవరి 10, 2023 ను చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; rrcjaipur.in పరిశీలించగలరు.