Aimk Mba : ఏఐఎంకే లో ఎంబీఏ ప్రోగ్రామ్ ప్రవేశానికి నోటిఫికేషన్

జనరల్‌ అభ్యర్థులకు రూ.600, ఆర్మీ అభ్యర్థులకు రూ.500 రూపాయలను ధరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తు చివరి తేదీ నవంబరు 24గా నిర్ణయించారు.

Aimk Mba : ఏఐఎంకే లో ఎంబీఏ ప్రోగ్రామ్ ప్రవేశానికి నోటిఫికేషన్

Aimk

Aimk Mba : కోల్‌కతాలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఏఐఎంకే) – ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ నిర్వహిస్తున్న ఎంబీఏ కోర్సు విధానాన్నే ఇక్కడ కూడా అనుసరిస్తారు. రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌గా ఉండే దీని వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్‌లు ఉంటాయి. సెమిస్టర్‌కు ఆరు పేపర్‌లు ఉంటాయి.

ప్రోగ్రామ్‌లో భాగంగా 14 కంపల్సరీ కోర్సులు, 10 స్పెషలైజేషన్‌ కోర్సులు, ప్రాజెక్ట్‌ వర్క్‌లు, వైవా వోస్‌, అసె్‌సమెంట్‌లు, సెమిస్టర్‌ ఎగ్జామినేషన్స్‌ ఉంటాయి. మొదటి సంవత్సరం చివరలో ఆరు నుంచి ఎనిమిది వారాల సమ్మర్‌ ప్రాజెక్ట్‌ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 120 సీట్లు ఉన్నాయి. జనరల్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సైనికులు, మాజీ సైనికులు, విశ్రాంత సైనికుల పిల్లలు ఆర్మీ కేటగిరీ కింద అప్లయ్‌ చేసుకోవాలి.

స్పెషలైజేషన్‌లు వివరాలకు సంబంధించి మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఆపరేషన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ వాటితోపాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దూరవిద్య విధానంలో డిగ్రీ పూర్తిచేసినవారు కూడా అర్హులు. క్యాట్‌ 2020 స్కోర్‌ తప్పనిసరి. అకడమిక్‌ ప్రతిభ, క్యాట్‌ 2020 స్కోర్‌ ఆధారంగా ఆర్మీ, జనరల్‌ అభ్యర్థులకు విడివిడిగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. వీరికి గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.

జనరల్‌ అభ్యర్థులకు రూ.600, ఆర్మీ అభ్యర్థులకు రూ.500 రూపాయలను ధరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తు చివరి తేదీ నవంబరు 24గా నిర్ణయించారు. అడ్మిషన్‌ సమయంలో డిగ్రీ సర్టిఫికెట్‌, మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌, డిగ్రీ మార్కుల పత్రాలు, క్యాట్‌ 2020 స్కోర్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డ్‌, పదోతరగతి సర్టిఫికెట్‌, క్యాస్ట్‌ సర్టిఫికెట్‌లకు సంబంధించి ఒక్కోటి రెండు కాపీలు; అయిదు ఫొటోలు అందజేయాల్సి ఉంటుంది, పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.aim.ac.in