Agniveers : ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ల కోసం ఈనెల 24న నోటిఫికేషన్

జులై 24న రాత పరీక్ష జరగనుంది. డిసెంబర్ 30లోగా శిక్షణ ప్రారంభం కానుంది. నేవీలో ఖాళీల భర్తీపై ఈనెల 25న ప్రకటన వెలువడనుంది.

Agniveers : ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ల కోసం ఈనెల 24న నోటిఫికేషన్

Iaf

Air Force agniveers : ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ల కోసం ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 24న రాత పరీక్ష జరగనుంది. డిసెంబర్ 30లోగా శిక్షణ ప్రారంభం కానుంది. నేవీలో ఖాళీల భర్తీపై ఈనెల 25న ప్రకటన వెలువడనుంది. నవంబర్ 21 నాటికి తొలి అగ్నివీర్ శిక్షణ ప్రారంభం కానుంది. భవిష్యత్‌లో రిక్రూట్‌మెంట్ అంతా అగ్నివీర్‌ ద్వారానే ఉంటుందని త్రివిధ దళాలు తేల్చిచెప్పాయి.

కోవిడ్ సమయంలో అర్హత సాధించినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు ఎయిర్ మార్షల్ సూరజ్‌ ఝా. అందుకే రెండేళ్ల వయసు మినహాయింపునిచ్చామన్నారు. అటు ఆందోళనల్లో పాల్గొని.. పోలీసు కేసులు ఎదుర్కొంటున్నవారిని ఎట్టిపరిస్థితుల్లో ఆర్మీలోకి తీసుకోబోమని డీఎంఏ అనిల్‌ పూరి అన్నారు.

Agnipath: ‘అగ్నిపథ్’ పథకంలో తొలి అడుగు.. జూన్ 24నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాల ప్రక్రియ షురూ..

రెండేళ్లుగా అగ్నివీర్‌పై అధ్యయనం చేశామని..అగ్నివీర్‌పై వెనక్కి తగ్గే ప్రసక్తే అనిల్‌ పూరి లేదన్నారు. అగ్నివీర్‌లు ప్రస్తుతం ఆర్మీలో పనిచేస్తున్నవారిలాగా ఇన్సూరెన్స్‌ కంట్రిబబ్యైషన్‌ చేయాల్సిన అవసరం లేదన్నారు. దేశ సేవలో అమరులైతే ఇన్సూరెన్స్‌ కంట్రిబ్యూషన్ లేకుండానే కోటి ఇన్సూరెన్స్‌ లభిస్తుందని అనిల్‌ పూరి అన్నారు.