మైనార్టీ గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్ : ఆన్ లైన్ లో దరఖాస్తు

తెలంగాణలో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

మైనార్టీ గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్ : ఆన్ లైన్ లో దరఖాస్తు

తెలంగాణలో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

హైదరాబాద్ : తెలంగాణలో మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8 వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను ఆన్ లైన్  పద్ధతిలో స్వీకరించనున్నారు. ఈమేరకు తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 31 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తలు స్వీకరిస్తామని తెలిపింది.

5వ తరగతి ప్రవేశానికి అర్హత పరీక్షను ఏప్రిల్ 20వ తేదీన, 6, 7, 8 వ తరగతుల ప్రవేశానికి అర్హత పరీక్షను ఏప్రిల్ 22 వ తేదీన నిర్వహించనున్నారు. మే 2 వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 3 నుంచి 10 వ తేదీ వరకు సిర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 1 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.