NTA JEE Main 2021 : జూలై 20 నుంచి JEE మెయిన్స్ పరీక్షలు.. తేదీలివే..!

జేఈఈ మెయిన్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐఐటీ, నిట్ వంటి విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ అడ్మిషన్లకు సంబంధించి జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూలై 20 నుంచి JEE మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.

NTA JEE Main 2021 : జూలై 20 నుంచి JEE మెయిన్స్ పరీక్షలు.. తేదీలివే..!

Nta Jee Main 2021 Exams From July 20, Application Forms Out

JEE Main 2021 Exam Dates : జేఈఈ మెయిన్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐఐటీ, నిట్ వంటి విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ అడ్మిషన్లకు సంబంధించి జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూలై 20 నుంచి JEE మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. మూడో సెషన్ పరీక్ష జూలై 20 నుంచి 25 వరకు జరుగనున్నాయి. నాలుగో సెషన పరీక్షలు జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కరోనావైరస్ నేపథ్యంలో రిజిస్టర్ చేసుకోలేని విద్యార్థులు మరోసారి అప్లయ్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్టు తెలిపారు.

మంగళవారం (జూలై 6) నుంచి జూలై 8 రాత్రి వరకు NTA వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. మూడో దశ ఏప్రిల్ సెషన్ పరీక్షకు జూలై 6 నుంచి జూలై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగో దశ మే సెషన్ పరీక్షకు జూలై 9 నుంచి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన JEE Mains 2021 సెషన్స్‌ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో CBSE 12వ తరగతి పరీక్షలు కూడా రద్దు కావడంతో, మూడో దశ, నాలుగో దశ JEE మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ నెలకొంది. జేఈఈ మెయిన్స్ ను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా ఫిబ్రవరిలో నిర్వహించగా.. రెండో విడత మార్చిలో నిర్వహించారు. ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన రెండు చివరి సెషన్లు కరోనా ప్రభావంతో వాయిదా పడ్డాయి. ఏప్రిల్ సెషన్ లో 6.80 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. మే సెషన్ సమయంలో 6.09 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. తొలి విడతలో 6.20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. రెండో విడతలో 5.56 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం https://jeemain.nta.nic.in/ వెబ్ సైట్ విజిట్ చేయండి.