ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ లో 6వేలకు పైగా ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 09:27 AM IST
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ లో 6వేలకు పైగా ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు(OFB) లో దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఎక్విప్ మెంట్ ఫ్యాక్టరీలో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 6వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఐటీఐ, నాన్ ఐటీఐ కింద పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణలోని మెదక్ జిల్లాలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా తెలంగాణ, చండీఘర్, మహారాష్ట్ర, ఒడిషా, తమిళనాడు, ఉత్తరఖాండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉన్న పోస్టులను సిల్క్ ఇండియా మిషన్ లో భాగంగా భర్తీ చేయనుంది.

విభాగాల వారీగా ఖాళీలు : 
ఐటీఐ – 3847
నాన్ ఐటీఐ – 2219

విద్యార్హత : నాన్ ఐటీఐ అభ్యర్ధులు 10వ తరగతిలో 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో 40 శాతం మార్కులు ఉండాలి. ఐటీఐ విభాగంలో ఐటీఐ పాసై ఉండాలి.

వయస్సు : అభ్యర్దుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి.

ఎంపికా విధానం : అభ్యర్దులను మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్దులకు రూ.100 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్ధులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : జనవరి 10, 2020.
దరఖాస్తు చివరి తేది : పిబ్రవరి 09, 2020.