KVS Vacant Posts : కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ.. నేటి నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగినవారు నేటి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈనెల 26వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి కానుంది.

KVS Vacant Posts : కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ.. నేటి నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

Kendriya Vidyalaya sangathan

KVS Vacant Posts : కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగినవారు నేటి నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈనెల 26వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి కానుంది. మొత్తం 13,404 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో టీజీటీ, పీజీటీ, పీఆర్టీ, లైబ్రేరియన్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (యూడీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎల్డీసీ), హిందీ ట్రాన్స్ లేటర్, స్టేనోగ్రాఫర్ గ్రేట్ 2 వంటి పోస్టులు ఉన్నాయి.

కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 13,404 పోస్టుల్లో పీఆర్టీ 6414, టీజీటీ 3176, పీజీటీ 1409, వైస్ ప్రిన్సిపల్ 203, అసిస్టెంట్ కమిషనర్ 52 చొప్పున ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే పీఆర్టీ పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి డీఈడీ, జేబీటీ, బీఈడీల్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. టీఆర్టీ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి బీఈడీ ఉత్తీర్ణత, సీటెట్ లో క్వాలిఫై కావాలి.

Panchayat Raj Department : తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖలో 529 ఖాళీ పోస్టులు

పీజీటీ పోస్టులకు పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై సీటెట్ లో అర్హత సాధించాలి. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపకి చేస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. డిసెంబర్ 5,2022 నుంచి దరఖాస్తుల ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్26, 2022. వైబ్ సైట్ www.kvsangathan.nic.inలో రిజస్ట్రేషన్ చేయాలి.