Paytm మాల్ ప్లాన్ : 300 మంది ఉద్యోగులు కావాలి

ప్రముఖ ఆలీబాబా ఇండియన్ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం పేటీఎం మాల్ కొత్త రిక్రూట్ మెంట్ ప్లాన్ చేస్తోంది. మరో 300 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : April 8, 2019 / 12:13 PM IST
Paytm మాల్ ప్లాన్ : 300 మంది ఉద్యోగులు కావాలి

ప్రముఖ ఆలీబాబా ఇండియన్ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం పేటీఎం మాల్ కొత్త రిక్రూట్ మెంట్ ప్లాన్ చేస్తోంది. మరో 300 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ప్రముఖ ఆలీబాబా ఇండియన్ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం పేటీఎం మాల్ కొత్త రిక్రూట్ మెంట్ ప్లాన్ చేస్తోంది. మరో 300 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ (O2O)బిజినెస్ కోసం.. వచ్చే రెండు మూడు నెలల్లో కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేయనుంది.

ఇప్పటికే వివిధ విభాగాల్లో మొత్తం 200 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. దేశవ్యాప్తంగా ఆన్ లైన్ టూ ఆఫ్ లైన్ అన్ని రకాలుగా కస్టమర్లకు అందుబాటులో ఉండేలా పేటీఎం మాల్ సేవలు అందించనుంది. ఓటూఓ బిజినెస్ ద్వారా గత ఆరు నెలల్లో 200 శాతం వరకు బిజినెస్ గ్రోత్ అయినట్టు పేటీఎం మాల్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Read Also : 2019 వరల్డ్ కప్.. టీమిండియా జట్టు ప్రకటన ఎప్పుడంటే?

పేటీఎం మాల్ బిజినెస్ పై సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మోతే మాట్లాడుతూ.. ఇండియాలో ‘O2O బిజినెస్ బాగా డెవలప్ అవుతోంది. వ్యాపార అభివృద్ధికి తగిన విధంగా మా కంపెనీ టీమ్ ను కూడా పెంచుతూ పోతున్నాం. ఇప్పటికే 200 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాం.

వచ్చేనెలల్లో మరో 300 మందిని బిజినెస్, టెక్నాలజీ, ప్రొడక్ట్ విభాగాల్లో రిక్రూట్ చేయాలని భావిస్తున్నాం’ అని అన్నారు. ఓటూఓ బిజినెస్ ద్వారా.. పేటీఎం మాల్ పై అందించే ప్రొడక్టులు, ఆఫర్లు ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయని శ్రీనివాస్ తెలిపారు. 
Read Also : Update చేసుకున్నారా? : వాట్సాప్ లో కొత్త ఫీచర్లు