ఏపీ బంద్‌ : ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి1, 2019 శుక్రవారం జరగాల్సిన ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 11:47 PM IST
ఏపీ బంద్‌ : ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి1, 2019 శుక్రవారం జరగాల్సిన ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి1, 2019న జరగాల్సిన ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర బంద్‌ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వాయిదా పడిన ఈ పరీక్ష నిర్వహణ తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

విభజన చట్టంలోని హామీలు అమలు చేయడంతోపాటు విభజన హామీలను కేంద్రం నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక హోదా సాధనసమితి ఫిబ్రవరి1, 2019 శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ బంద్‌కు టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో పాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.