Job Vacancies : పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ ఫైర్, బీఈ, బీటెక్‌ ఫైర్ టెక్నాలజీ, ఫైర్ ఇంజినీరింగ్, సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులను రాత, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Job Vacancies : పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
ad

Job Vacancies : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో పలు పోస్టుల భర్తీకి చేపట్టనున్నారు. న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయం దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో మేనేజర్‌, ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 103 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న వాటిలో ఆఫీసర్ ఫైర్ సేఫ్టీ23 ఖాళీలు, మేనేజర్ సెక్యూరిటీ80 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ ఫైర్, బీఈ, బీటెక్‌ ఫైర్ టెక్నాలజీ, ఫైర్ ఇంజినీరింగ్, సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులను రాత, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులను చీఫ్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ విభాగం, హెచ్‌ఆర్‌డీ డివిజన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్, ప్లాట్ నెం.4, సెక్టార్ 10, ద్వారక, న్యూదిల్లీ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 30 ఆగస్టు 2022ని నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.pnbindia.in/ పరిశీలించగలరు.