CISF Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగ నియామకాలు!

అభ్యర్ధుల వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విషయానికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్ , ట్రేడ్ టెస్ట్ , రాత పరీక్ష , మెడికల్ ఎగ్జామినేషన్ అధారంగా ఎంపిక చేస్తారు.

CISF Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఉద్యోగ నియామకాలు!

Recruitment in Central Industrial Security Force!

CISF Recruitment : ప్రభుత్వరంగ పరిశ్రమల భద్రత నిమిత్తం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశవ్యాప్తంగా కానిస్టేబుల్ డ్రైవర్, కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఫైర్ సర్వీస్ ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. ఆసక్తి, అర్హత కలిగిన పురుష అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఖాళీల వివరాలను పరిశీలిస్తే కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు మొత్తం 183 ఉన్నాయి. కానిస్టేబుల్ డైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఫైర్ సర్వీసుకు సంబంధించి 268 ఖాళీలు ఉన్నాయి. మెట్రిక్యులేషన్ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన వారు అర్హులు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి.

అభ్యర్ధుల వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విషయానికి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్ , ట్రేడ్ టెస్ట్ , రాత పరీక్ష , మెడికల్ ఎగ్జామినేషన్ అధారంగా ఎంపిక చేస్తారు. నెలకు వేతనంగా 21, 700 నుండి 69, 100 వరకు చెల్లిస్తారు.

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు ఫిబ్రవరి 22, 2023ను చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; cisf.gov.in పరిశీలించగలరు.