TSRTC Apprentice Recruitment : టీఎస్‌ఆర్టీసీ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ, బీటెక్ అర్హత ఉన్న అభ్యర్థులు ఇంజినీరింగ్ విభాగంలో అప్పెంటీస్ ఖాళీలకు బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ డిగ్రీ అర్హత ఉన్నవారు నాన్-ఇంజినీరింగ్ విభాగంలోని అప్పెంటిస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

TSRTC Apprentice Recruitment : టీఎస్‌ఆర్టీసీ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ

Recruitment of Apprentice Posts in TSRTC

TSRTC Apprentice Recruitment : ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థలో (టీఎస్‌ఆర్టీసీ) అప్రెంటిస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజినీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఖాళీలకు సంబంధించి నాన్-ఇంజినీరింగ్ ఖాళీలు 150 , ఇంజినీరింగ్ ఖాళీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. రీజియన్లవారీగా నాన్-ఇంజినీరింగ్ ఖాళీలు పరిశీలిస్తే హైదరాబాద్-26, సికింద్రాబాద్-18, మహబూబ్ నగర్-14, మెదక్-12, నల్లగొండ-12, రంగారెడ్డి-12, ఆదిలాబాద్-09, కరీంనగర్-15, ఖమ్మం-09, నిజామాబాద్-09, వరంగల్-01 ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ, బీటెక్ అర్హత ఉన్న అభ్యర్థులు ఇంజినీరింగ్ విభాగంలో అప్పెంటీస్ ఖాళీలకు బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ డిగ్రీ అర్హత ఉన్నవారు నాన్-ఇంజినీరింగ్ విభాగంలోని అప్పెంటిస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్ కాల వ్యవధి 3 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు మూడేళ్లపాటు స్టైపెండ్ అందజేస్తారు. మొదటి ఏడాది నెలకు రూ.15,000; రెండో ఏడాది నెలకు రూ.16,000, మూడో ఏడాది నెలకు రూ.17,000 చెల్లిస్తారు. వయోపరిమితి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు అక్టోబరు 16, 2022లోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.tsrtc.telangana.gov.in/ పరిశీలించగలరు.