NIMS Recruitment : నిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

Assistant Professor
NIMS Recruitment : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Vacancies in IDBI : ఐడీబీఐ లో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీ
అనస్థీషియాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ జెనెటిక్స్, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, పాథాలజీ, పాథాలజీ ఆంకాలజీ, రుమటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, యూరాలజీ వాస్కులర్ సర్జరీ తదితర విభాగాలలో ఈ ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Maganti Babu : టీడీపీ నేత మాగంటి బాబుపై కేసు నమోదు
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్ధుల వయసు 50 సంవత్సరాలకు మించకూడదు. దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో అందజేయాల్సి ఉంటుంది.
READ ALSO : Prevention of Pests : వరి, పత్తిలో చీడపీడల నివారణ
అర్హత/ అనుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 2వ అంతస్తు, ఓల్డ్ బ్లాక్, పంజాగుట్ట, హైదరాబాద్-500082, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబరు 30 చివరిగడువుతేదిగా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nims.edu.in/ పరిశీలించగలరు.