Western Railway Recruitment : వెస్ట్రన్ రైల్వే లో క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీ

వీటిలో లెవల్ 2, లెవల్3, లెవల్ 4, లెవల్ 5 పోస్టులు ఉన్నాయి. లెవల్ 2, 3 కి దరఖాస్తు చేసుకోవాలంటే.. ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే సరిపోతుంది. లెవల్ 4,5 పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

Western Railway Recruitment : వెస్ట్రన్ రైల్వే లో క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీ

Western Railway Recruitment : వెస్ట్రన్ రైల్వే పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తారు. వీటిలో లెవల్ 2, లెవల్3, లెవల్ 4, లెవల్ 5 పోస్టులు ఉన్నాయి. లెవల్ 2, 3 కి దరఖాస్తు చేసుకోవాలంటే.. ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే సరిపోతుంది. లెవల్ 4,5 పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు.

దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు గరిష్ట వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. లెవల్ 2 కింద రూ.19900 నుంచి రూ.63,200 వరకు లెవల్ 3 కింద రూ.21,700 నుంచి 69,100 వరకు జీతం చెల్లిస్తారు. లెవల్ 4 కింద ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి 81,100 వరకు జీతం చెల్లిస్తారు. లెవల్ 5 కింద రూ.29,200 నుంచి 92,300 వరకు చెల్లిస్తారు.

టైపింగ్ లో ఇంగ్లీష్ నిమిషానికి 30 పదాలు, హిందీ 25 పదాలను టైప్ చేసే విధంగా 4 సంవత్సరాలలో సర్టిఫికేట్ పొందాలి. దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 10, 2022తో ముగియనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.rrc-wr.com/ పరిశీలించగలరు.