BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ మచిలీపట్నం యూనిట్‌లో ఒప్పంద ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ మచిలీపట్నం యూనిట్‌లో ఒప్పంద ఖాళీల భర్తీ

BEL Recruitment : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, మచిలీపట్నం యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 37 ప్రాజెక్ట్‌ ఇంజినీర్, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందియన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ లేదా లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

ఖాళీల వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఎలక్ట్రానిక్స్‌ పోస్టులు 7, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ మెకానికల్‌ పోస్టులు 7, ట్రైనీ ఇంజనీర్‌ ఎలక్ట్రానిక్స్‌ పోస్టులు 11, ట్రైనీ ఇంజనీర్‌ మెకానికల్‌ పోస్టులు 10, ట్రైనీ ఇంజనీర్‌ కంప్యూటర్‌ సైన్స్ పోస్టులు 2 ఉన్నాయి. దరఖాస్తుదారుల వయసు 28 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 26, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in పరిశీలించగలరు.