HLL Lifecare Limited Recruitment : హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌లో ఒప్పంద ఖాళీల భర్తీ

ఫైనాన్స్, క్లినికల్ రీసెర్చ్, ఎనలిటికల్, సెల్ కల్చర్, మైక్రోబయాలజీ, నేచురల్ ప్రొడక్ట్స్,కెమిస్ట్రీ, యానిమల్ హౌస్, సింథటిక్ ప్రొడక్ట్స్‌, లైబ్రరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

HLL Lifecare Limited Recruitment : హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌లో ఒప్పంద ఖాళీల భర్తీ

HLL Lifecare Limited Recruitment : భారత ప్రభుత్వ రంగానికి చెందిన హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ లిమిటెడ్‌లో ఒప్పంద, రెగ్యులర్ ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్, డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, రీజినల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఫైనాన్స్, క్లినికల్ రీసెర్చ్, ఎనలిటికల్, సెల్ కల్చర్, మైక్రోబయాలజీ, నేచురల్ ప్రొడక్ట్స్,కెమిస్ట్రీ, యానిమల్ హౌస్, సింథటిక్ ప్రొడక్ట్స్‌, లైబ్రరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 2, 2022వ తేదీలోపు ఈమెయిల్‌ ఐడీకి దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్‌ ఐడీ: recruiter@lifecarehll.com. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.lifecarehll.com/పరిశీలించగలరు.