ITBP Recruitment : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిగ్రీ(సైకాలజీ) లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ITBP Recruitment : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

Recruitment of Head Constable Posts in Indo-Tibetan Border Police Force

ITBP Recruitment : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా గ్రూప్-సి విభాగంలో ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం భర్తీ చేయనున్న ఖాళీలు 23 ఉన్నాయి. వీటిలో పురుషులకు 20 ఖాళీలు, మహిళలకు 3 ఖాళీలు కేటాయించారు.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే డిగ్రీ(సైకాలజీ) లేదా డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 13 అక్టోబర్ 2022 నుండి మొదలై 11 నవంబరు 2022ను చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://itbpolice.nic.in/ పరిశీలించగలరు.