IRTC Recruitment : ఐఆర్టీసీలో హాస్పిటాలిటీ మానిటరింగ్ పోస్టుల భర్తీ

అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విద్యార్హత, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 జీతంగా చెల్లిస్తారు. ఇంటర్వ్యూలను 24-08-2022, 25-08-2022 తేదిలలో నిర్వహిస్తారు.

IRTC Recruitment : ఐఆర్టీసీలో హాస్పిటాలిటీ మానిటరింగ్ పోస్టుల భర్తీ

Recruitment of Hospitality Monitoring Posts in IRTC

IRTC Recruitment : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్(ఐఆర్టీసీ)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. సౌత్‌ సెంట్రల్‌ జోన్‌లోని నామినేటెడ్ మొబైల్, స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లలో మొత్తం 60 హాస్పిటాలిటీ మానిటర్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2021, 2022 విద్యా సంవత్సరాల్లో బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

అభ్యర్థుల ఎంపికకు సంబంధించి విద్యార్హత, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 జీతంగా చెల్లిస్తారు. ఇంటర్వ్యూలను 24-08-2022, 25-08-2022 తేదిలలో నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలు నిర్వహించే చిరునామా ; ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దగ్గర, వీవీఎస్‌ నగర్, భువనేశ్వర్, ఒడిశా. హైదరాబాద్‌లో ఇంటర్వ్యూను 27ఆగస్టు2022, 28ఆగస్టు2022 తేదీల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఎఫ్‌-రో, విద్యానగర్, డీడీ కాలనీ అడ్రస్‌లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.irctc.com/ పరిశీలించగలరు.