TSPSC JL Recruitment : తెలంగాణాలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్‌ 16 నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి కలిగినవారు జనవరి 6 , 2023లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2023 జున్ లేదా జూలైలో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.

TSPSC JL Recruitment : తెలంగాణాలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ

TSPSC Junior Lecturer Notification

TSPSC JL Recruitment : తెలంగాణ రాష్ట్రంలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్సీయస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 1392 జూనియర్ లెక్చర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఖాళీల వివరాలకు సంబంధించి అరబిక్‌ పోస్టులు: 2, బోటనీ పోస్టులు: 113, బోటనీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15, కెమిస్ట్రీ పోస్టులు: 113, కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 19, సివిక్స్‌ పోస్టులు: 56, సివిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 1, సివిక్స్‌ (మరాఠీ) పోస్టులు: 1, కామర్స్‌ పోస్టులు: 50, కామర్స్‌ (ఉర్దూ మీడియం) పోస్టులు: 7, ఎకనామిక్స్‌ పోస్టులు: 81, ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 15, ఇంగ్లిష్‌ పోస్టులు: 153, ఫ్రెంచ్‌ పోస్టులు: 2, హిందీ పోస్టులు: 117, హిస్టరీ పోస్టులు: 77, హిస్టరీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 17, హిస్టరీ (మరాఠీ) పోస్టులు: 1, మ్యాథమెటిక్స్‌ పోస్టులు: 154, మ్యాథమెటిక్స్‌ (ఉర్దూ మీడియం) పోస్టులు: 9, ఫిజిక్స్ పోస్టులు: 112, ఫిజిక్స్ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18, సంస్కృతం పోస్టులు: 10, తెలుగు పోస్టులు: 60, ఉర్దూ పోస్టులు: 28, జువాలజీ పోస్టులు: 128, జువాలజీ (ఉర్దూ మీడియం) పోస్టులు: 18 ఖాళీలు ఉన్నాయి.

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్‌ 16 నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి కలిగినవారు జనవరి 6 , 2023లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2023 జున్ లేదా జూలైలో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.