CAPF Medical Officer Recruitment : సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

అభ్యర్థులు తప్పనిసరిగా ఎంబీబీఎస్, సంబంధిత రంగంలో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు.

CAPF Medical Officer Recruitment : సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

CAPF Medical Officer Recruitment : భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వివిధ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో గ్రూప్ A కింద మొత్తం 297 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ , సశాస్త్ర సీమా బాల్ , అస్సాం రైఫిల్స్‌లో మెడికల్ ఆఫీసర్లను నియమించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు తప్పనిసరిగా ఎంబీబీఎస్, సంబంధిత రంగంలో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. అయితే, సూపర్ స్పెషాలిటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 40 ఏళ్లు వయోపరిమితిగా నిర్ణయించారు.

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ capf.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించేందుకు చివరి తేదీ మార్చి 16, 2023.గా నిర్ణయించారు.