Indian Army Recruitment : ఇండియన్ ఆర్మీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ

ఖాళీల వివరాలను పరిశీలిస్తే MTS (ఆఫీస్) 3 ఖాళీలు, కుక్ 2 ఖాళీలు, ధోభి 3 , తోటమాలి 2 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

Indian Army Recruitment : ఇండియన్ ఆర్మీలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ

headquarters southern command

Indian Army Recruitment : ఇండియన్ ఆర్మీలో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఆధ్వర్యంలోని యూనిట్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

READ ALSO : PM Modi: ప్రత్యేక సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు .. ప్రతిపక్షాలకు మోదీ కీలక సూచన

ఖాళీల వివరాలను పరిశీలిస్తే MTS (ఆఫీస్) 3 ఖాళీలు, కుక్ 2 ఖాళీలు, ధోభి 3 , తోటమాలి 2 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటుగా సంబంధిత పనిలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

READ ALSO : IIT Kanpur Recruitment : కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

రాత పరీక్ష అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఏడవ సెంట్రల్ పే కమిషన్ ప్రకారం, పే స్కేల్ లెవెల్-1, రూ.18000-56900వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 8,2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://indianarmy.nic.in/ ను సందర్శించగలరు.