Hyderabad IIT Recruitment : హైదరాబాద్ ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి 10 వతరగతి, ఐటీఐ, డిగ్రీ, పీజీతో పాటు సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

Hyderabad IIT Recruitment : హైదరాబాద్ ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ

Recruitment of non-teaching posts in Hyderabad IIT

Hyderabad IIT Recruitment : హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 31 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల వివరాలకు సంబంధించి చీఫ్ లైబ్రరీ ఆఫీసర్ 1 ఖాళీ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 1 ఖాళీ, టెక్నికల్ ఆఫీసర్ 4 ఖాళీలు, సెక్షన్ ఆఫీసర్ 1 ఖాళీ, అసిస్టెంట్ ఇంజినీర్ 1 ఖాళీ, టెక్నికల్ సూపరింటెండెంట్ 4 ఖాళీలు, జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ 2 ఖాళీలు, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ 2 ఖాళీలు, జూనియర్ టెక్నీషియన్ 9ఖాళీలు, మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్ 1 6 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి 10 వతరగతి, ఐటీఐ, డిగ్రీ, పీజీతో పాటు సంబంధిత పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుముగా 500 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా 19 సెప్టెంబర్ 2022ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://iith.ac.in/careers/ పరిశీలించగలరు.