JOBS : సెయిల్ లో పారామెడిక్ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి టెన్త్,ఇంటర్మీడియట్, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం,డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించివారు అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది.

JOBS : సెయిల్ లో పారామెడిక్ పోస్టుల భర్తీ
ad

JOBS : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన పశ్చిమ బెంగాల్‌లోని బర్న్‌పూర్ హాస్పిటల్‌లో ప్రొఫిషియెన్సీ ట్రైనింగ్ ప్రోగ్రాం(పారామెడిక్స్) లో భాగంగా 45 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 7పోస్టులు, డ్రెస్సర్ 3, ఎక్స్-రే టెక్నీషియన్ 4, ఈసీజీ టెక్నీషియన్ 3, డయాలసిస్ టెక్నీషియన్ 2, ఫార్మాసిస్ట్ 6, ల్యాబొరేటరీ టెక్నీషియన్ అండ్‌ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ 12, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ టెక్నీషియన్ 1, ఆప్టోమెట్రిస్ట్ 2, ఫ్లేబోటోమిస్ట్ 2, వ్యాక్సినేటర్ 1, డెంటల్ హైజీనిస్ట్ 1, డెంటల్ అసిస్టెన్స్/డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్ 1 ఖాళీ ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి టెన్త్,ఇంటర్మీడియట్, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం,డిప్లొమా, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించివారు అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. అభ్యర్ధులు ఆగస్టు 12, 13 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ జరిగే చిరునామా ; బురాన్‌పూర్ పోస్ట్ ఆఫీస్‌కు ఎదురు, భన్లా భవన్ దగ్గర, పోస్ట్ ఆఫీస్ బురాన్పూర్ -713325, పశ్చిమ్ బర్ధమాన్, పశ్చిమ బెంగాల్. దరఖాస్తును పంపాల్సిన ఈ మెయిల్‌ medical.burnpurhospital@gmail.com, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://sailcareers.com/ పరిశీలించగలరు.