JOBS : ఆర్‌ఆర్‌సీ ఎన్‌సీఆర్‌లో పోస్టుల భర్తీ

ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1659 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

JOBS : ఆర్‌ఆర్‌సీ ఎన్‌సీఆర్‌లో పోస్టుల భర్తీ

JOBS : ప్రయాగ్‌రాజ్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్‌ సెంట్రల్‌ రైల్వే(ఎన్‌సీఆర్‌) రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)లో వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1659 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ట్రేడులకు సంబంధించి ఫిట్టర్,వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, స్టెనోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మెన్, హెల్త్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మల్టీమీడియా అండ్‌ వెబ్‌పేజ్‌ డిజైనర్‌ తదితరాలు ఉన్నాయి.

ప్రాంతాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే ప్రయాగ్‌రాజ్‌703, ఝాన్సీ660, ఆగ్రా296 ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఎన్‌సీవీటీ,ఎస్‌సీవీటీ జారీచేసిన ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది ఆగస్టు 1, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.rrcpryj.org/ పరిశీలించగలరు.