AIIMS Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్ లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనిర్సిటీ నుంచి సంబంధత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, ఎంఎస్‌, ఎండీ, డీఎన్‌బీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

AIIMS Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్ లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ

AIIMS Recruitment : భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఒరిస్సా రాష్ట్రంలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 99 సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలు అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ తదితర విభాగాల్లో ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనిర్సిటీ నుంచి సంబంధత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌, ఎంఎస్‌, ఎండీ, డీఎన్‌బీ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి. అభ్యర్ధులు దరఖాస్తులను సెప్టెంబర్‌ 30, 2022 లోపు ఈమెయిల్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది.తరువాత దరఖాస్తు నకళ్లను అక్టోబర్‌ 8వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700లతోపాటు ఇతర అలవెన్సులను కూడా జీతంగా చెల్లిస్తారు.

దరఖాస్తులను పంపాల్సిన ఈమెయిల్‌ ఐడీ: academic@aiimsbhubaneswar.edu.in అడ్రస్: రిజిస్ట్రార్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), భువనేశ్వర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, 1వ అంతస్తు సిజెలా, పోస్ట్: దుముదుమా, భువనేశ్వర్ (ఒడిశా) – 751019. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiims.edu/en.html పరిశీలించగలరు.