Staff Nurse Vacancies : ఏపి వైద్యఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Staff Nurse Vacancies : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 957 స్టాఫ్ నర్స్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియామకం చేపట్టనున్నారు. ఏడాది కాల పరిమితికి గాను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ ఉంటుంది. జోన్ వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి జోన్ 1 లో 163 ఖాళీలు, జోన్ 2లో 264, జోన్ 3లో 239, జోన్ 4లో 291 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 42 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 2 నుండి 8 వరకు అందుబాటులో అప్లికేషన్ ప్రొఫార్మా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటుంది. పూర్తి చేసిన అప్లికేషన్లను డిసెంబర్ 9లోగా అయా రీజనల్ డైరెక్టర్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://cfw.ap.nic.in పరిశీలించగలరు.