EPFO Recruitment : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ

అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

EPFO Recruitment : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ

EPFO Recruitment

EPFO Recruitment : న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దేశ వ్యాప్తంగా వివిధ రీజియన్లలో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 185 స్టెనోగ్రాఫర్‌ పోస్టులను భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుండి ఇంటర్మీడియట్‌ (10+2) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్టెనోగ్రఫీ సర్టిఫికెట్‌ ఉండాలి. అభ్యర్ధుల వయసు18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3 నుంచి 8 ఏళ్ల సడలింపు ఉంటుంది.

READ ALSO : Rajampet Lok Sabha Constituency : రసవత్తరంగా రాజంపేట పార్లమెంట్‌ రాజకీయం….ట్రయాంగిల్‌ ఫైట్‌ తప్పదా ?

అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 26, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 27 నుంచి ప్రారంభమవుతాయి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.epfindia.gov.in/site_en/index.php పరిశీలించగలరు.