AP Model Schools Recruitment : ఏపి మోడల్ స్కూల్స్ లో టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంగ్లిష్‌,సివిక్స్‌,కామర్స్‌,ఎకనామిక్స్‌,మ్యాథమెటిక్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ,బోటనీ, స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ,రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయసు 44 ఏళ్లకు మించరాదు.

AP Model Schools Recruitment : ఏపి మోడల్ స్కూల్స్ లో టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ

Recruitment of TGT and PGT posts in AP Model Schools

AP Model Schools Recruitment : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో 282 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటి) పోస్టులను ఏపీ పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. వీటిల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీ) పోస్టులు 71, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీ) పోస్టులు 211 వరకు ఉన్నాయి. జోన్ల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే టీజీటీ పోస్టులు: జోన్‌ 1లో 17 ఖాళీలు, జోన్‌ 3లో 23 ఖాళీలు, జోన్‌ 4లో 31 ఖాళీలు ఉన్నాయి. పీజీటీ పోస్టులు: జోన్‌ 1లో 33ఖాళీలు, జోన్‌ 2లో 4ఖాళీలు, జోన్‌ 3లో 50ఖాళీలు, జోన్‌ 4లో 124 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంగ్లిష్‌,సివిక్స్‌,కామర్స్‌,ఎకనామిక్స్‌,మ్యాథమెటిక్స్,ఫిజిక్స్,కెమిస్ట్రీ,బోటనీ, స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ,రెండేళ్ల మాస్టర్‌ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయసు 44 ఏళ్లకు మించరాదు. అభ్యర్ధులను జోన్లవారీగా అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్టు 17, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.