AIC of India Recruitment : అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ట్రెయినీ పోస్టుల భర్తీ
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Recruitment of trainee posts in Agriculture Insurance Company of India Limited
AIC of India Recruitment : అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఏఐసీ) పలు ఉద్యోగఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. న్యూఢిల్లీలోని ఈ సంస్థలో రూరల్ మేనేజ్‌మెంట్, లా విభాగాల్లో ఉన్నఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ & కోఆపరేషన్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్, రూరల్ మేనేజ్‌మెంట్, లా) పీజీ ఎంబీఏ (రూరల్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, అగ్రి-బిజినెస్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) పీజీ డిప్లొమా (రూరల్ మేనేజ్‌మెంట్, అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్)లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 06 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aicofindia.com/పరిశీలించగలరు.