Trainee Posts Recruitment : సెయిల్ లో ట్రైనీ పోస్టుల భర్తీ

ఏడాది కాలం పాటు ఈ పోస్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో సెయిల్ లో ట్రైనీ పోస్టుల శిక్షణలో పాల్గొన్న వారు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. దరఖాస్తు చేసేందుకు ఆగస్ట్ 20, 2022 ఆఖరు తేదిగా నిర్ణయించారు.

Trainee Posts Recruitment : సెయిల్ లో ట్రైనీ పోస్టుల భర్తీ
ad

Trainee Posts Recruitment : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్ ) ట్రైనీ పోస్టులు భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు డిపార్ట్‌మెంట్స్‌లో మొత్తం 200 ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. రౌర్కెలాలోని ఇస్పత్ జనరల్ హాస్పిటల్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఖాళీల వివరాలకు సంబంధించి మెడికల్ అటెండెంట్ శిక్షణ 100, క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనింగ్ 20, అడ్వాన్స్‌డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనింగ్ 40,డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ 6, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ 10,హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 10,ఆపరేషన్ థియేటర్, అనస్థీషియా అసిస్టెంట్ 5,రేడియోగ్రాఫర్ 3,ఫార్మసిస్ట్ 3, అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ 3 ట్రైనీ ఖాళీలు ఉన్నాయి.

ఏడాది కాలం పాటు ఈ పోస్టుల్లో పనిచేయాల్సి ఉంటుంది. గతంలో సెయిల్ లో ట్రైనీ పోస్టుల శిక్షణలో పాల్గొన్న వారు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. దరఖాస్తు చేసేందుకు ఆగస్ట్ 20, 2022 ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://igh.sailrsp.co.in/ పరిశీలించగలరు.