Hindustan Aeronautics Recruitment : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ట్రైనీ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 15 నుంచి 18 యేళ్ల మధ్య ఉండాలి. అకడమిక్‌ మెరిట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.

Hindustan Aeronautics Recruitment : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ట్రైనీ ఖాళీల భర్తీ

Hindustan Aeronautics Recruitment : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిధిలోని టెక్నికల్ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్ లో పలు ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన 120 అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండాలి. అకడమిక్‌ మెరిట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఆపరేటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ విభాగాల్లో 15 నుంచి 24 నెలల పాటు ట్రైనింగ్‌ ఉంటుంది. సెప్టెంబర్‌ 9, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://hal-india.co.in/ పరిశీలించగలరు.