IIST Recruitment : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టుల ఆధారంగా అనుసరించి బీఎస్‌, బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ, ఎంఎస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించరాదు. అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

IIST Recruitment : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీ

IIST Recruitment : కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఎస్ టీ) పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో జూనియర్‌, సీనియర్‌ రిసెర్చ్‌ఫెలో, జూనియర్‌ ప్రాజెక్ట్‌ఫెలో పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టుల ఆధారంగా అనుసరించి బీఎస్‌, బీఈ, బీటెక్‌, ఎంఎస్సీ, ఎంఎస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించరాదు. అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 23,000 నుంచి రూ. 35,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 10 అక్టోబర్ 2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iist.ac.in/ పరిశీలించగలరు.