Apprentice Vacancies : మిధానిలో 140 అప్రెంటిస్ ఖాళీల భర్తీ

టెక్నీషిన్ అప్రెంటిస్ లు ; మెషినిస్ట్, టర్నర్ , వెల్డర్ మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. రెగ్యులర్ విధానంలో ఐటిఐ ఉత్తీర్ణులైన వారు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మెషినిస్ట్, టర్నర్ అప్పెంటిస్ లకు నెలకు 8050రూపాయలు, వెల్డర్ అప్రెంటిస్ లకు 7,700 రూపాయలు నెలకు చెల్లిస్తారు.

Apprentice Vacancies : మిధానిలో 140 అప్రెంటిస్ ఖాళీల భర్తీ

Mishra Dhathu (1)

Apprentice Vacancies : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖి చెందిన హైద్రాబాదులోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని)లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లు (ఇంజనీరింగ్) ; మెటలర్జీ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ , సివిల్, ఈసీఈ/ఐటి విభాగాల్లో మొత్తం 40 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బిటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. నెలకు 9వేల రూపాయలు స్టైఫండ్ గా చెల్లిస్తారు.

టెక్నిషియన్ డిప్లొమా అప్రెంటిస్ లు ; మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, సివిల్ విభాగాల్లో 30 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టులో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. నెలకు 8వేల రూపాయలను స్టైఫండ్ గా చెల్లిస్తారు.

టెక్నీషిన్ అప్రెంటిస్ లు ; మెషినిస్ట్, టర్నర్ , వెల్డర్ మొత్తం 70 ఖాళీలు ఉన్నాయి. రెగ్యులర్ విధానంలో ఐటిఐ ఉత్తీర్ణులైన వారు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మెషినిస్ట్, టర్నర్ అప్పెంటిస్ లకు నెలకు 8050రూపాయలు, వెల్డర్ అప్రెంటిస్ లకు 7,700 రూపాయలు నెలకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం మెరిట్ మార్కులు, రిజర్వేషన్ అధారంగా ఉంటుంది. అభ్యర్ధులు ధరఖాస్తును ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు నవంబరు 10 చివరి తేదిగా నిర్ణయించగా, మిధాని పోర్టల్ ద్వారా దరఖాస్తులకు నవంబరు 13 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://iifpt.edu.in