Upsc Jobs : యూపీఎస్సీలో 59 ఖాళీల భర్తీ

నేవల్ క్వాలిటీ అస్యూరెన్స్, నేవి, జియలాజికల్ సర్వే, ఎకనమిక్ ఇన్వెస్టిగేషన్ తదితర విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇం

Upsc Jobs :  యూపీఎస్సీలో 59 ఖాళీల భర్తీ

Upsc

Upsc Jobs : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కేంద్ర మంత్రిత్వశాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే అసిస్టెంట్ ఇంజనీర్, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్ తదితర ఖాళీలు ఉన్నాయి.

నేవల్ క్వాలిటీ అస్యూరెన్స్, నేవి, జియలాజికల్ సర్వే, ఎకనమిక్ ఇన్వెస్టిగేషన్ తదితర విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఉత్తీర్ణులై ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

అభ్యర్ధుల ఎంపిక విధానం రిక్రూట్ మెంట్ టెస్ట్ , ఇంటర్యూ అధారంగా ఉంటుంది. అభ్యర్ధులు ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు చేయటానికి చివరితేది అక్టోబరు 14గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.upsc.gov.in/ సంప్రదించాలి.