Indian Navy : ఇండియన్ నేవీలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ

స్త్రీ , పురుషులు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేది జులై 11, 2022గా నిర్ణయించారు.

Indian Navy : ఇండియన్ నేవీలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ

Indian Navy

Indian Navy : భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ముంబాయిలోని ఇండియన్ నేవీ నావెల్ డాక్ యార్డ్ అప్పెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 338 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, మెరైన్ ఇంజిన్ ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, ప్యాటర్న్ మేకర్ , మెకానిక్ డీజిల్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్, షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్, మెకానిక్ రెఫ్ అండ్ ఏసీ, టైలర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల వయోపరిమితికి సంబంధించి 2001, ఆగస్టు1 నుండి 2008 అక్టోబర్ 31 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదవతరగతిలో 50శాతం మార్కులతోపాటు, పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఐటీఐ లేదంటే తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన స్త్రీ , పురుషులు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేది జులై 11, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://indiannavy.nic.in/పరిశీలించగలరు.