Outsourcing Jobs : ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు ఫీజుగాను ఓసీ అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులు 300రూ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది.

Outsourcing Jobs : ప్రకాశం జిల్లాలో కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ

Health Jobs

Outsourcing Jobs : ప్రకాశం జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్ కు చెందిన వివిధ ఆసుపత్రుల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి ల్యాబ్ అటెండెంట్ 2 ఖాళీలు, కౌన్సెలర్ 1 ఖాళీ, ఆడియో మెట్రిషియన్ 1 ఖాళీ, బయోమెడికల్ ఇంజినీర్ 2 ఖాళీలు, ప్లంబర్ 3 ఖాళీలు, ఎలక్ట్రిషియన్ 2ఖాళీలు, రేడియో గ్రాఫర్ 1 ఖాళీ ఉన్నాయి.

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఆయా పోస్టులను అనుసరించి పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బీఏ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏపీ పారామెడికల్ లో రిజిస్టర్ అయిఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి రిజర్వేషన్, మెరిట్ మార్కుల అధారంగా అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజుగాను ఓసీ అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్ధులు 300రూ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూడీ వారికి ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్ లైన్ విధానంలో ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పటల్ సర్వీస్, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దరఖాస్తులు పంపేందుకు ఏప్రిల్ 18, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://prakasam.ap.gov.in/notice_category/recruitment/పరిశీలించగలరు.