APMDC JOBS : ఏపిఎమ్ డీసీలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ |Replacement of contract jobs in APM DC

APMDC JOBS : ఏపిఎమ్ డీసీలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంజనీరింగ్ డిప్లొమా, లా డిగ్రీ, బీఈ, బీటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటుగా , టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

APMDC JOBS : ఏపిఎమ్ డీసీలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

APMDC JOBS : ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ విజయవాడ కార్యాలయంలో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి జనరల్ మేనేజర్ కోల్ 1 ఖాళీ, డిప్యూటీ జనరల్ మేనేజర్ లీగల్, ఐటీ పోస్టులు 2, మైనింగ్ మేనేజర్ 1 ఖాళీ, సూపర్ వైజర్, ఫోర్ మెన్, ఓవర్ మెన్ 30ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంజనీరింగ్ డిప్లొమా, లా డిగ్రీ, బీఈ, బీటెక్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటుగా , టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు పోస్టులను అనుసరించి నెలకు 40,000రూ నుండి 1,00,000 వేతనంగా చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈ మెయిల్, పోస్టు ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరి తేది 27.05.2022గా నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన ఈ మెయిల్ ఐడి ; apmdchrdrecruitments@gmail.com, దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ది ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్, డోర్ నెం; 294/1D, 100అడుగుల రోడ్, కానూరు, విజయవాడ-521137, ఇక పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://apmdc.ap.gov.in/ పరిశీలించగలరు.

×