JOBS : ఏపి, టిఎస్ లో దివ్యాంగ్ జన్ ఉద్యోగాల భర్తీ

ఎంఎస్‌ఈసీ, నోయిడాలో 1 రెగ్యులర్ పోస్టు ఖాళీగా ఉంది. అర్హత మాస్టర్స్‌ డిగ్రీతో పాటు ఎంఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సీఆర్‌సీ, దావనగెరెలో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

JOBS : ఏపి, టిఎస్ లో దివ్యాంగ్ జన్ ఉద్యోగాల భర్తీ

Divyang Jan

JOBS : భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజెబిలిటీస్‌ (దివ్యాంగ్ జన్)లో ఉద్యోగాల భర్తీ చేపటనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా లెక్చరర్‌, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ఆఫీస్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీలు 19 ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎన్ ఐఈపీఈడీ సికింద్రాబాద్‌లో మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. వీటిలో లెక్చరర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌, ఎల్‌డీసీ, టైపిస్ట్‌, హిందీ టైపిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌,మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతో పాటు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.

ఎంఎస్‌ఈసీ, నోయిడాలో 1 రెగ్యులర్ పోస్టు ఖాళీగా ఉంది. అర్హత మాస్టర్స్‌ డిగ్రీతో పాటు ఎంఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. సీఆర్‌సీ, దావనగెరెలో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో లెక్చరర్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, ప్రోస్థెటిస్ట్‌ అండ్‌ ఆర్థోటిస్ట్‌, ఓరియంటేషన్‌ అండ్‌ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు ఉన్నాయి. అర్హతలులకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

సీఆర్‌సీ, నెల్లూరులో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మెడికల్‌ పీఎంఆర్‌, క్లినికల్‌ అసిస్టెంట్‌, క్లర్క్ వంటి పోస్టులు ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, బీఎస్సీ, బీఎస్సీ(ఎంఆర్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టైపింగ్‌ స్పీడ్‌ వచ్చి ఉండాలి. సీఆర్‌సీ, రాజ్‌నందగావ్‌ చత్తీస్‌గఢ్‌లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్పెషల్‌ ఎడ్యుకేటర్‌, ఓరియంటేషన్‌ అండ్‌ మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు ఉన్నాయి. అర్హతలకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లోడిప్లొమా, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానానికి సంబంధించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదిగా జులై
5, 2022 ను నిర్ణయించారు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా; డైరెక్టర్, ఎన్ ఐఈపీఐడీ, మనో వికాస్ నగర్, సికింద్రా బాద్ 500009, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://niepid.nic.in/పరిశీలించగలరు.