IB Jobs : ఐబీలో గ్రేడ్ 2 ఏసీఐఓ ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ 2020,2021,2022 స్కోర్ కార్డు ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

IB Jobs : ఐబీలో గ్రేడ్ 2 ఏసీఐఓ ఉద్యోగాల భర్తీ

Ib

IB Jobs : ఇంటిలిజెన్స్ బ్యూరో (ఐబీ) సంస్ధలో పలు విభాగాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్లు గ్రేడ్ 2(ఏసీఐఓ) పోస్టులు భర్తీచేయనున్న పోస్టుల్లో ఉన్నాయి. విభాగాల వారీగా పోస్టుల వివరాలను పరిశీలిస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 56, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 94 పోస్టులు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ 2020,2021,2022 స్కోర్ కార్డు ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే గేట్ 2020,2021,2022 మెరిట్ స్కోర్, ఇంటర్వ్యూఅధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 16 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తులకు చివరి తేది మే 7, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.mha.gov.in/సంప్రదించగలరు.