NTRO : ఎన్టీఆర్ ఓలో ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

NTRO : ఎన్టీఆర్ ఓలో ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ

Ntro Jobs

NTRO : భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 206 ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సాఫ్ట్ వేర్ ప్రొగ్రామర్ , రిస్క్ అనలిస్ట్, నెట్ వర్క్ అడ్మినేస్ట్రేటర్ తదితర పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానినికి సంబంధించి క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ పద్దతి అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22 నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మే 16, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://ntro.gov.in/ సంప్రదించగలరు.