Contract Jobs : ప్రకాశం జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఒప్పంద ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ , రిజర్వేషన్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుకు సంబంధించి ఓసి అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు 300రూ, వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

Contract Jobs : ప్రకాశం జిల్లాలో వైద్య విధాన పరిషత్  ఒప్పంద ఉద్యోగాల భర్తీ

Contract Jobs

Contract Jobs : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రకాశం జిల్లాలో పలు ఉద్యోగల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలను ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. వివిధ ఆసుపత్రుల్లో బయో మెడికల్ ఇంజినీర్, థియేటర్ అసిస్టెంట్, పోస్టు మార్టం అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఖాళీల వారిగా పోస్టులను పరిశీలిస్తే బయో మెడికల్ ఇంజినీర్ పోస్టులు 1 ఖాళీ, థియేటర్ అసిస్టెంట్ పోస్టు 1 ఖాళీ, పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టు 7 ఖాళీలు, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టు 3 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత టెక్నికల్ కోర్సు, బీటెక్ బయోమెడికల్ ఇంజినీరింగ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి అకడమిక్ మెరిట్ , అనుభవం, రిజర్వేషన్, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 15,000 రూ నుండి 52, 000 రూ వరకు చెల్లిస్తారు.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ , రిజర్వేషన్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుకు సంబంధించి ఓసి అభ్యర్ధులు 500రూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు 300రూ, వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా జిల్లా కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్, దరఖాస్తులు పంపేందుకు మే 26, 2022 ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://prakasam.ap.gov.in/ పరిశీలించగలరు.