Replacement : ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీ

అభ్యర్ధులు కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Replacement : ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీ

Ncc Posts

Replacement : ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీ చేపట్టునుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిగ్రీతో పాటు ఎన్ సీసీ అర్హత ఉన్న అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను అభ్యర్ధులు పొందిన అకడమిక్ మార్కుల జాబితా అధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

అభ్యర్ధులు కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మూడు అకడమిక్ సంవత్సరాలు ఎన్ సీసీ సీనియర్ డివిజన్ వింగ్ లో కొనసాగి ఉండాలి. ఎన్ సీసీ సీ సర్టిఫికెట్ లో కనీసం బి గ్రేడ్ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్ సీసీ సి సర్టిఫికేట్ అవసరం లేదు.

అభ్యర్ధుల వయస్సు 19 సంవత్సరాల నుండి 25 సంవత్స రాల మధ్య ఉండాలి. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 13, 2022 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.joinindianarmy.nic.in సంప్రదించగలరు.