Jobs : బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టుల భర్తీ

దరఖాస్తు రుసుముగా రూ. 850 రుసుము చెల్లించాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు పీజు చెల్లించాలి. ఎస్.సి, ఎస్టీ ,దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 175 రూపాయలుగా నిర్ణయించారు.

Jobs : బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టుల భర్తీ

Boi

Jobs : బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 549 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్కేల్ 4 ఆఫీసర్ ర్యాంక్ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయనున్నారు. మొత్తం 594 పోస్టులు భర్తీ చేయనుండగా వాటిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 102 పోస్టులను నియమకాలు చేపట్టనున్నారు. ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

భర్తీ చేయనున్న పోస్టుల్లో మేనేజర్ ఐటీ, సీనియర్ మేనేజర్ ఐటీ, సీనియర్ మేనేజర్ నెట్‌వర్క్ సెక్యూరిటీ, సీనియర్ మేనేజర్ నెట్‌వర్క్ రూటింగ్ అండ్ స్విచింగ్ స్పెషలిస్ట్‌లు, మేనేజర్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, మేనేజర్ డేటా సెంటర్, మేనేజర్ డేటాబేస్ ఎక్స్‌పర్ట్, మేనేజర్ టెక్నాలజీ, మేనేజర్ ఆర్కిటెక్ట్, మేనేజర్ అప్లికేషన్ ఆర్కిటెక్ట్ పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 150 నిమిషాలు ఉంటుంది. మొత్తం 175 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.

దరఖాస్తు రుసుముగా రూ. 850 రుసుము చెల్లించాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు పీజు చెల్లించాలి. ఎస్.సి, ఎస్టీ ,దివ్యాంగుల అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 175 రూపాయలుగా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 26, 2022 నుండి ప్రారంభం అవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరితేది మే 10, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bankofindia.co.in/పరిశీలించగలరు.