Ttd Jobs : టిటిడి ఆయుర్వేదిక్ కళాశాలలో పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ఆయుర్వేదంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 41 ఏళ్లకు మించరాదు.

Ttd Jobs : టిటిడి ఆయుర్వేదిక్ కళాశాలలో పోస్టుల భర్తీ

Ttd Ayurvedic

Ttd Jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్‌వీ ఆయుర్వేదిక్‌ కాలేజ్ లో లెక్చరర్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలకు నియామకాలు చెపట్టనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. సంహిత, సిద్ధాంత్‌, క్రియా శరీర్‌, ద్రవ్యగుణ, రసశాస్త్ర, అగడతంత్ర ఎవం విధి వైద్యక, శలక్య తంత్ర, పంచకర్మ సబ్జెక్టుల బోధనా ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ఆయుర్వేదంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 41 ఏళ్లకు మించరాదు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు వేతనంగా రూ. 54,060ల నుంచి రూ.1,40,540ల వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; ఎస్.వి.ఆయుర్వేదిక్ కాలేజ్, టిటిడి, కె.టి.రోడ్, తిరుపతి-517 502. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేది మే 21, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.tirumala.org/ పరిశీలించగలరు.