Neeri Jobs : హైద్రాబాద్ నీరీలో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీ

ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్, ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తులకు చివరి తేది నవంబరు 14వ తేదిగా నిర్ణయించారు.

Neeri Jobs : హైద్రాబాద్ నీరీలో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీ

Neeri

Neeri Jobs : హైద్రాబాద్ లోని సీఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (నీరీ)లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న వాటిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ 10 ఖాళీలు, ప్రాజెక్ట్ అసోసియేట్ 3ఖాళీలు ఉన్నాయి.

ప్రాజెక్టు అసిస్టెంట్ నియామకానికి సంబంధించి వయస్సు 50 ఏళ్లకు మించకూడదు. సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. నెలకు 20,000వేతనంతోపాటు హెచ్ ఆర్ ఏ చెల్లిస్తారు. ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుల విషయానికి వస్తే అభ్యర్ధుల వయస్సు 35ఏళ్లకు మించరాదు. ఎమ్మెస్సీ(ఎన్విరాన్ మెంట్ సైన్స్) బీఈ, బీటెక్(ఎన్విరాన్ మెంట్, సివిల్ ఇంజనీరింగ్)ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత సబ్జెక్టులో నాలెడ్జ్ కలిగి ఉండాలి. నెలకు 25000వేతనం తోపాటు హెచ్ ఆర్ ఏ చెల్లిస్తారు.

ఆన్ లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్, ఈ మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తులకు చివరి తేది నవంబరు 14వ తేదిగా నిర్ణయించారు. ఈ మెయిల్ ధరఖాస్తులకు చివరి తేది నవంబరు 19తేది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.neeri.res.in/