Replacement : కాగ్ లో 199 స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ

అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ఆడిటర్ అండ్ అకౌంటెంట్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ, క్లర్క్,డీఈఓ గ్రేడ్ ఏ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదంటే తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతసాధించి ఉండాలి. పాటు

Replacement : కాగ్ లో 199 స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ

Cag Of India

Replacement : న్యూఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)కి చెందిన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్ మెంట్ లో స్పోర్ట్స్ కోటా ద్వారా గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 199 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి ఆడిటర్, అకౌంటెంట్, క్లర్క్, డీఈఓ గ్రేడ్ ఏ వంటి పోస్టులు ఉన్నాయి.

క్రికెట్, ఫుట్ బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నీస్, హాకీ క్రీడాంశాలుగా ఉన్నాయి. అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే ఆడిటర్ అండ్ అకౌంటెంట్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ, క్లర్క్,డీఈఓ గ్రేడ్ ఏ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదంటే తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతసాధించి ఉండాలి. పాటుగా టైపింగ్ టెస్ట్ అర్హత ఉండాలి.

అభ్యర్ధుల వయస్సు 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, ఫీల్డ్ ట్రయల్స్, స్పోర్ట్స్ ఉత్తీర్ణత మార్కులు, ఫిట్ నెస్, టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆఫ్ లైన్ ద్వారా అభ్యర్ధులు ధరఖాస్తు లను సంబంధిత నోడల్ అధికారుల చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తులకు చివరి తేది అక్టోబరు 30గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://cag.gov.in